Army Group C Recruitment 2024 / Telugu Latest Jobs – ఆర్మీలో 625 గ్రూప్ C జాబ్స్.. అప్లై చేసుకోండి ఇలా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్ (DG EME) నుండి ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో 625 గ్రూప్ C ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలు జనవరి 17 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. వీరు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డ్రైవర్ పోస్టులకు 30 సంవత్సరాలు వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అప్లై చేసుకునే వారికి రాత పరీక్ష మరియు స్కిల్స్ టెస్ట్ ఆధారంగా జాబ్ ఇవ్వనున్నారు.
Army Group C Recruitment 2024 / Telugu Latest Jobs – ఆర్మీలో 625 గ్రూప్ C జాబ్స్.. అప్లై చేసుకోండి ఇలా..

ఉద్యోగ వివరాలు
ఈ జాబ్స్ మనకు Army DG EME – Director General of Electronics and Mechanical ప్రభుత్వ సంస్థల నుంచి విడుదల చేశారు ఇందులో గ్రూప్ సి 625 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. డ్రైవర్ పోస్టులకు మాత్రమే ఇచ్చారు.
- అదేవిధంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
విద్యా అర్హత
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేవారు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితోపాటు 35 WPM ఇంగ్లీష్ టైప్ చేసే స్కిల్స్ ఉండాలి.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన వారికి ₹30,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునేవారు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరి వలన ఉచితంగా అప్లై చేసే అవకాశం కల్పించారు.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు జనవరి 17 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
సెలెక్ట్ చేసే విధానం
ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రెండు గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్ష OMR విధానంలో ఉంటుంది ఇందుకుగా 150 మార్కులు పెడతారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లై చేసే విధానం
- ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి.
- మీ యొక్క అన్ని డీటెయిల్స్ అప్లికేషన్ ఫారంపై వివరంగా ఫీల్ చేయండి.
- మీ సర్టిఫికెట్స్ అన్ని జిరాక్స్ తీసి దానిపై సంతకాలు చేయండి
- ఐదు రూపాయల స్టాంప్ మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ ఇన్వాల్వ్ కవర్ పై అతికించండి.
- నోటిఫికేషన్లు ఇచ్చిన అడ్రస్ కు పంపించండి
అడ్రస్
నోటిఫికేషన్ లో అడ్రస్ వివరాలు ఇవ్వబడ్డాయి వివరంగా చూసి అప్లై చేసుకోండి.
