SCR Railway Recruitment 2025 / Telugu Latest Jobs – దక్షిణ మధ్య రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాల నోటిఫికేషన్.. దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్ జోన్) అప్రెంటీస్ విధానంలో 4,232 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి మరియు ITI ఉత్తీర్ణులైన అభ్యర్థులు, వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉంటే, ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపిక, రాత పరీక్ష లేకుండా, మెరిట్ ఆధారంగా మాత్రమే చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలు పరిశీలించి వెంటనే దరఖాస్తు చేయాలి. రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రా గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
SCR Railway Recruitment 2025 / Telugu Latest Jobs – దక్షిణ మధ్య రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాల నోటిఫికేషన్..

ఉద్యోగ వివరాలు
దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్ జోన్) 4,232 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలకు అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ (ITI) పూర్తిచేసి ఉండాలి. ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
విద్యా అర్హత
- అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ (ITI) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సంబంధిత ట్రేడ్స్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండడం తప్పనిసరి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 28 డిసెంబర్ 2024
- ఆఖరి తేదీ: 27 జనవరి 2025
జీతం వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటీస్ కాలంలో నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
- ఇతర అలవెన్సులు అందుబాటులో ఉండవు.
వయసు వివరాలు
- అభ్యర్థుల వయస్సు కనీసం 15 సంవత్సరాలు ఉండాలి.
- గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు.
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు.
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాల సడలింపు.
సెలెక్ట్ చేసే విధానం
- ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.
- మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ రుసుము
- జనరల్ మరియు OBC అభ్యర్థులకు ₹100/- ఫీజు.
- SC, ST, మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారం
- 10వ తరగతి మార్కుల మెమో
- ఐటీఐ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
- స్టడీ సర్టిఫికెట్లు
అప్లై చేసే విధానం
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ ఫారం నింపి సమర్పించవచ్చు.
- నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్‌లోడ్ కోసం క్రింది లింకులను ఉపయోగించండి.

Notification PDF: డౌన్లోడ్ చేయండి
Apply Online: అప్లై చేయండి
గమనిక: దక్షిణ మధ్య రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.