TELANAGANA MEESEVA RECRUIMENT 2024 / తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు.. తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో భీమవరం, జగిత్యాల, సారంగాపూర్, మరియు మెట్పల్లి మండల గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేసుకునే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండవలెను. ఈ అభ్యర్థులు నోటిఫికేషన్ లో చెప్పిన విధంగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండవలెను. ఈ మీ సేవ కేంద్రాలకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలను ఇస్తారు. మిగతా విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి. పూర్తిగా వివరంగా చూసి అప్లై చేసుకోగలరు.
మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందు మీరే ఈ అప్డేట్ చదవండి.
Sainik School LDC recruitment 2024
TELANAGANA MEESEVA RECRUIMENT 2024 / తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు..

ఉద్యోగ వివరాలు విద్యా అర్హతలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో భీమవరం, జగిత్యాల, సారంగాపూర్, మరియు మెట్టుపల్లి మండల గ్రామ పంచాయతీలలో కొత్తగా నాలుగు మీ సేవ కేంద్రాలు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎవరైనా ఏదైనా సంబదిత డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వారికి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం ఈ మీసేవ కేంద్రాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు నవంబర్ 26 – 2024 నుండి 4th డిసెంబర్ 25 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను పూర్తిగా నింపి ఆ అప్లికేషన్ ఫారంను సంబంధిత తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఛార్జ్
ఈ మీసేవ కేంద్రాలు ఏర్పాటుకై దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు DD డిస్టిక్ కలెక్టర్ జగిత్యాల గారి పేరుమీద తీసి అర్జీతో సమర్పించాలి.

జీతం వివరాలు
సెలెక్ట్ చేయబడ్డ అభ్యర్థులు మీ సేవ కేంద్రాల్లో చేసే పనిని బట్టి కొంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అత్యధికంగా 30,000 సంపాదించుకోవచ్చు.
ఎంపిక చేసే విధానం
ఈ మీసేవ కేంద్రాలకు అప్లై చేసుకుని అభ్యర్థులకు 100 మార్కుల రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ 100 మార్కుల రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రాత పరీక్ష మీసేవ సర్వీసెస్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ పై అవగాహన ఉందా లేదా అని సంబంధిత విభాగంలో ఉంటుంది.
కావలసిన పత్రాలు
- ఏదైనా మెట్రిక్యులేషన్ మరియు మిగతా అర్హతలు కలిగిన ఒరిజినల్ మెమోలు డిగ్రీ ఇంటర్ టెన్త్
- సంబంధిత కుల దృవీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం లోకల్ సర్టిఫికెట్
- చదువుకున్న సర్టిఫికెట్స్ అన్ని బోనఫైడ్ తో సహా ఉండాలి.
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ ని వివరంగా చూసి అందులో అన్ని అర్హతలు చూసుకొని నోటిఫికేషన్ తెలిపిన విధంగా అప్లై చేసుకోగలరు. కింద ఇవ్వబడే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.
మీసేవ సేవా కేంద్రాలను అప్లై చేసుకునే అభ్యర్థులు ఆ జిల్లాకు చెందిన వారై ఉండాలి. ఇతర జిల్లా కేంద్రాలకు సంబంధించిన వారు వీటికి అర్హులు కాదు.
Notification PDF CLICK HERE
Application From CLICK HERE