DPHCL Recruitment 2025 / Telugu Latest Jobs – పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. కేంద్ర ప్రభుత్వ ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (DPHCL) తాజాగా టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ విభాగాల్లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్ లాంటి 10 పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలు సాధించడానికి నిర్దిష్టమైన విద్యా అర్హతలు, అనుభవం మరియు వయస్సు పరిమితి విధించినట్లు ప్రకటించారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈ వివరాలను గమనించి అప్లికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది.
DPHCL Recruitment 2025 / Telugu Latest Jobs – పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఉద్యోగ వివరాలు:
కేంద్ర ప్రభుత్వ ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో మొత్తం 10 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తోంది. పోస్టులలో కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నాయి.
విద్యా అర్హత:
- కనీసం డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి కావాలి.
- MBA లేదా MCOM చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
- సంబంధిత విభాగంలో కనీసం 05 సంవత్సరాల అనుభవం ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: 10 జనవరి 2025
- అప్లికేషన్ ఆఖరు తేదీ: 10 ఫిబ్రవరి 2025
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000 నుండి ₹40,000 వరకు జీతం ఉంటుంది. అదనంగా ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు లభిస్తాయి.
వయసు వివరాలు:
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 నుండి 53 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- SC, ST, OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం:
- ఎటువంటి రాతపరీక్ష లేకుండా అర్హతలు, వయస్సు, అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- దరఖాస్తు పూర్తిగా సరైన పద్ధతిలో పంపినవారిని మాత్రమే పరిశీలిస్తారు.
అప్లికేషన్ రుసుము:
- ఈ నోటిఫికేషన్ కోసం ఏదైనా అప్లికేషన్ ఫీజు లేదు.
ఉండవలసిన డాక్యుమెంట్స్:
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
- 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
- స్టడీ, కుల దృవీకరణ పత్రాలు
- అనుభవ సర్టిఫికెట్స్
అప్లై చేసే విధానం:
- నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలను పరిశీలించాలి.
- అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి పూర్తి చేయాలి.
- దరఖాస్తు ఫారం మరియు అవసరమైన సర్టిఫికెట్స్ ను ఈమెయిల్ ద్వారా dphcltd@yahoo.com కు పంపించవచ్చు లేదా డైరెక్ట్ / పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
Notification PDF
పూర్తి నోటిఫికేషన్ కోసం అధికారిక లింక్ చూడండి.

గమనిక:
ఈ నోటిఫికేషన్ పై పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే అప్లై చేయండి.