NIAB Recruitment 2025 / Telugu Latest Jobs – పశుసంవర్ధక శాఖ (NIAB) ప్రాజెక్ట్ అసోసియేట్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB), హైదరాబాద్, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయబడతాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత సమయానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
NIAB Recruitment 2025 / Telugu Latest Jobs – పశుసంవర్ధక శాఖ (NIAB) ప్రాజెక్ట్ అసోసియేట్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఉద్యోగ వివరాలు:
- పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-1
- పోస్టుల సంఖ్య: 01
- చేరిక: ఒక సంవత్సరానికి కాంట్రాక్టు పద్ధతిలో
విద్యా అర్హత:
- అభ్యర్థులు లైఫ్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సీ, ఎమ్మెచ్‌టెక్ లేదా సమానమైనవి) పూర్తి చేసి ఉండాలి.
- NET లేదా GATE స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 జనవరి 2025
- ఆన్లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ: 10 ఫిబ్రవరి 2025
వయసు వివరాలు:
- అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹31,000/- శాలరీతో పాటు HRA చెల్లించబడుతుంది.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష లేదా అప్లికేషన్ ఫీజు లేకుండా, మెరిట్ మార్కులు, NET/GATE స్కోర్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం నియామకం జరుగుతుంది.
అప్లికేషన్ రుసుము:
NIAB ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావలసిన సర్టిఫికెట్లు:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత సర్టిఫికెట్లు
- స్టడీ సర్టిఫికెట్లు (1వ తరగతి నుండి 10వ తరగతి వరకు)
- కుల ధ్రువీకరణ పత్రాలు (SC/ST/OBC/EWS)
- అనుభవం మరియు NET/GATE స్కోర్ ఉన్న అభ్యర్థులకు సంబంధిత ధృవపత్రాలు
అప్లై చేసే విధానం:
- NIAB నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్‌ను ఆధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
- అన్ని అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, దరఖాస్తు పూర్తి చేయండి.
- దరఖాస్తు సమయంలో పేర్కొన్న తుది తేదీకి ముందు ఫారమ్ సబ్మిట్ చేయడం తప్పనిసరి.

Notification PDF
- నోటిఫికేషన్ వివరాలు మరియు అప్లికేషన్ ఫారమ్ కోసం NIAB అధికారిక వెబ్‌సైట్ చూడండి.
- అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక: అర్హులైన అభ్యర్థులు పూర్తిగా వివరాలు పరిశీలించి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.