District Court Recruitment 2025 / Telugu Latest Jobs – జిల్లా కోర్టులో 340 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ తెలంగాణా రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో పని చేసేందుకు 340 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది. అన్ని జిల్లాలకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కనీసం ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య వయసుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చూసి వివరంగా అప్లై చేసుకోండి. మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
District Court Recruitment 2025 / Telugu Latest Jobs – జిల్లా కోర్టులో 340 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఉద్యోగ వివరాలు:
తెలంగాణాలోని అన్ని జిల్లాల కోర్టుల్లో 340 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ | 8 జనవరి 2025 |
దరఖాస్తు ముగింపు తేదీ | 31 జనవరి 2025 |
రాత పరీక్ష తేదీ | ఏప్రిల్ 2025 (ఖచ్చితమైన తేదీ త్వరలో |
జీతం వివరాలు:
నెలకు ₹40,000/- జీతంతో పాటు TA, DA, HRA వంటి ఇతర అలవెన్సులు ఉంటాయి.
వయసు వివరాలు:
- వయస్సు పరిమితి: 18 నుండి 34 సంవత్సరాలు
- SC, ST, EWS, OBC అభ్యర్థులకు: 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం:
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష:
- జనరల్ నౌలెడ్జి, జనరల్ ఇంగ్లీష్ అంశాలపై 100 ప్రశ్నలు
- పరీక్షకు 120 నిమిషాలు సమయం
- రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థుల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది.
అప్లికేషన్ రుసుము:
- OC, OBC అభ్యర్థులకు: ₹600/-
- SC, ST, EWS అభ్యర్థులకు: ₹400/-
రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
ఉండవలసిన డాక్యుమెంట్స్:
- OTPR రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రాలు (SC, ST, OBC, EWS)
- 1వ నుండి 7వ తరగతి స్టడీ సర్టిఫికేట్లు
- 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత సర్టిఫికేట్లు
అప్లై చేసే విధానం:
- అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
- నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలు చదవాలి.
- అప్లికేషన్ ఫారమ్ భర్తీ చేసి అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.
- రుసుము చెల్లించి దరఖాస్తు సమర్పించాలి.
